ఆ గట్టునుంటావా రోజా..ఈ గట్టు కొస్తావా..

సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎందరో నటీనటులు రాజకీయంలో బాగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రోజా సడన్గా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై మరొక పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆర్కే రోజా పై పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదు. 2004 టీడీపీ తరఫున నగిరి నుంచి పోటీ చేసినావు రోజా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైసిపి గూటికి చేరి నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2019లో కూడా రోజా నగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అదే సంవత్సరం జగన్ సర్కార్ ఆంధ్ర ఎన్నికలలో విజయ డంకా మోగించింది. ఇక ఆ తర్వాత నుంచి రోజా నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై ఆమె విరుచుకుపడేది.
అలాంటి రోజా 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశించి విఫలమయ్యింది. ఇక ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో అస్సలు కనిపించడం మానేసింది. ప్రస్తుతం ఆమెకు ఆంధ్రాలో గడ్డుకాలం నడుస్తోంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇటు నగరిలో కూడా ఆమెపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. అందుకే వైసీపీ తో పాటు అసలు ఆంధ్రానే వదిలి వెళ్ళిపోవాలి అని రోజా భావిస్తున్నట్టు సరికొత్తగా పుకార్ మొదలయ్యింది. గతంలో రోజా విజయ్ తో కలిసి పలు చిత్రాలలో నటించడం ఈ పుకార్ కి బలాన్ని చేకూరుస్తోంది..
ఆమె త్వరలో వైసీపీ కు రాజీనామా చేసి తమిళనాడులో సెట్టిల్ అవ్వడానికి భావిస్తున్నట్లు టాక్. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆయన పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు టాక్. అయితే ఇవి ఎప్పటిలాగా వచ్చే మామూలు పుకార్ల.. లేక వీటిలో నిజం ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోపక్క ఇదంతా కల్పితం అని…రోజా త్వరలో తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు.