Delhi: భారత్ బంగ్లా నడుమ మరో వివాదం..
బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్(mujibur) రెహ్మాన్ ఇల్లు, మ్యూజియాన్ని గుంపు దహనం చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ చర్యను భారత్ సైతం తీవ్రంగా ఖండించింది. ఆక్రమణ, అణచివేత శక్తులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజల వీరోచిత పోరాటానికి నిదర్శనంగా ఉన్న షేక్ ముజిబుర్ రెహ్మాన్..చారిత్రక నివాసం ధ్వంసం కావడం చాలా విచారకరమన్నారు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆ భవనం విలువేంటో.. బంగ్లా జాతీయ పోరాటంలో పాల్గొన్నవారందరికీ తెలుసన్నారు.
షేక్ హసీనా ప్రసంగం చేస్తే.. బుల్డోజర్ ఊరేగింపు నిర్వహించాలని అంతకుముందే సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. పెద్ద గుంపు ఓ బుల్లోజర్ తో .. రెహ్మాన్ ఇంటికి చేరుకుని ..గేట్లు ధ్వంసం చేశారు. కొందరు సెకండ్ పోర్షన్ లో ఉన్న చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఫొటోలు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారని డాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. అయితే స్థానిక మీడియా దీన్ని.. షేక్ హసీనా ప్రసంగంతో ముడిపెట్టింది కూడా.
షేక్ ముజీబుర్ రెహమాన్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టడం తమ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్(Bangladesh) తాజాగా వ్యాఖ్యానించింది. ఆ పరిణామంపై భారత్ స్పందించడం సముచితం కాదని పేర్కొంది. ఢాకాలోని ముజీబుర్ చరిత్రాత్మక నివాసమైన ‘32 ధాన్మండీ’కి నిరసనకారులు గత బుధవారం నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దానిపై భారత్ గురువారం ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి విధ్వంసక చర్యను బలంగా ఖండించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ రఫీకుల్ ఆదివారం స్పందించారు. తమ అంతర్గత వ్యవహారాలపై భారత్ స్పందన అనూహ్యం, అనుచితమని పేర్కొన్నారు.






