మోడీ ద విజనరీ లీడర్..ప్రపంచం చెబుతున్న మాటలివి..
దశాబ్దాల పెద్దన్న పెత్తనానికి కాలం చెల్లింది. ఇప్పుడు తన సమస్యలు విప్పుకోలేక తానే సతమతమవుతోంది అమెరికా. ఇక అగ్రరాజ్యం కావాలన్న దశాబ్దాల చైనా కలకు బీటలు పడుతున్నాయి. అతివేగంగా అభివృద్ధి చెందాలన్న కాంక్షతో నేలవిడిచి సాముచేసిన డ్రాగన్ కంట్రీ… ఇప్పుడు వాటి ఫలితాలతో సతమతమవుతోంది. మరోవైపు.. ఆదేశాన్ని నమ్మేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అన్ని దేశాలు.. సమస్య వచ్చినప్పుడు…. భారతదేశం వైపు చూడడం పరిపాటిగా మారింది. అది ఇతర ప్రధానులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. కేవలం భారత ప్రధాని మోడీ నాయకత్వ పటిమకు ఆకర్షితులై.. ప్రపంచం భారత్ వైపు ఆశగా చూపిస్తోంది. వచ్చే శతాబ్దానికి నాయకత్వం వహించే సత్తా భారత్ కు మాత్రమే ఉందని బలంగా నమ్ముతోంది.
అమెరికా తాను, తన మిత్రపక్షాలను పరిరక్షించుకోవడానికి పరిమితమైంది. చైనా ఉన్న భూభాగం చాలదని.. ప్రత్యర్థి దేశాల భూభాగాలను కలుపుకుని విశాలశక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. వ్యాపార పరంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. కేవలం భారత్ మాత్రమే .. ప్రపంచం విపత్తు సమయంలో ఉన్నప్పుడు… బాధ్యతగా సాయమందించింది. కరోనా సమయంలో కోట్లాది కోవిడ్ టీకాలను ప్రపంచానికి ఉచితంగా అందించింది. దీనికి తోడు ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా.. తక్షణం ఆదేశాలకు ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ పరిణామాలను చూస్తున్న ప్రపంచదేశాలు.. భారతదేశం మామిత్రదేశమంటూ గర్వంగా ప్రకటించుకుంటున్నాయి.
ప్రపంచాన్ని కలవరపరుస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రధానిమోడీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేశం ఎక్కువ కాదు.. ఏదేశం తక్కువ కాదన్నారు మోడీ. రష్యాకు…మిత్రుడిగా హితబోధ చేస్తున్నారు. ఇది శాంతియుగం.. యుద్ధాల యుగం కాదని సుతిమెత్తగా చురకలు వేశారు. అయితే అదే రష్యా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినప్పుడు.. చమురు కొనుగోలు చేసి ఆదుకున్నారు. దీంతో రష్యాకు భారత్ అన్నా మోడీ అన్నా చెప్పలేని ఇష్టం. ఆ ఇష్టాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్.. నిర్మొహమాటంగా పలుమార్లు ప్రస్తావించారు. ఇక మోడీకి ఉన్న పరపతి చూసి.. యుద్దం ఆపేందుకు సహకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం కోరారు. ఇద్దరు నేతలతో మోడీ సమావేశాలు అవుతూ.. సామరస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు కూడా.
మోడీ తన పాలనలో భారత దేశ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా చాలా రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ ..ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారింది. దాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మోడీ సర్కార్ కృషి చేస్తోంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నదే తన థ్యేయమని సగర్వంగా ప్రకటించుకున్నారు మోడీ.






