US: బంగ్లా వ్యవహారాలు మోడీ సెట్ చేస్తారు… ఇండియా చూసుకుంటుందన్న ట్రంప్..
పొరుగున ఉన్న బంగ్లాదేశ్ వ్యవహారాలు భారత్ కు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్(Yunis) నేతృత్వంలోని సర్కార్ .. క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతోంది. సైన్యం కూడా అల్లర్లు జరుగుతున్న పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. దీంతో ఇండియా అనుకూల పార్టీ అవామీ(Awami) లీగ్ పార్టీ సానుభూతిపరులు, నేతల ఇళ్లపై దాడులు సాదారణమయ్యాయి. ఇళ్లు దోచుకోవడం, నేతలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. వీటన్నింటినీ మించి సాక్షాత్తూ బంగబంధు ముజిబుర్ రెహ్మాన్(Mujibur house) ఇంటిని దాడి చేసి ధ్వంసం చేశాయి మూకలు. వీటిని ఖండించిన భారత్ ను.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిష్టూరమాడింది బంగ్లా సర్కార్.
అయితే ప్రధాని మోడీ మాత్రం టైమ్ కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ తో భేటీ అనంతరం.. సాక్షాత్తూ అమెరికాఅధ్యక్షుడి నోటే ఆమాట వినిపించింది. బంగ్లాదేశ్ వ్యవహారాలపై ప్రశ్నించిన మీడియాకు ట్రంప్ ఇదే చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ట్రంప్ ఖండించారు. అంతేకాదు.. బంగ్లాదేశ్‌కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.‘‘మా డీప్ స్టేట్ ఎటువంటి పాత్ర లేదు. ఇది ప్రధానమంత్రి(మోడీ) చాలా కాలంగా డీల్ చేస్తున్నారు. నేను బంగ్లాదేశ్‌ని ప్రధానికి వదిలేస్తున్నాను’’ అని అన్నారు.
ట్రంప్‌తో భేటీకి ముందు అమెరికా జాతీయ నిఘా విభాగ అధిపతి తులసీ గబ్బార్డ్(Tulasi gabbard)తో మోడీ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి చర్చించారు. గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తర్వాత ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. భారత్ ఎంతగా చెప్పినప్పటికీ యూనస్ దీనిపై చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం పెరిగింది. బంగ్లా వ్యాప్తంగా భారత్ వ్యతిరేకతను పెంచి పోషించారు.






