Wahsington: యూరప్ వర్సెస్ అమెరికా.. ట్రేడ్ వార్ తో ప్రపంచానికి కష్టాలే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)… ప్రపంచాన్ని ట్రేడ్ వార్ తో బెంబేలెత్తిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకుంటే.. టారిఫ్ లను విధిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో మిత్రులు లేదు.. శత్రువులు లేరు ఎవరైనా ఒక్కటే.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఇది అమెరికా సన్నిహత దేశాలకు నచ్చడం లేదు. ఇన్నాళ్లు కలిసి మెలిసి ఉన్న తమపై .. ఇప్పుడు అమెరికా కర్రపెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాయి ఆయా దేశాలు. ఏదో కెనడా, మెక్సికోతో వ్యవహారం అంటే ఓకే. అదిప్పుడు యూరోపియన్ యూనియన్ వరకూ వచ్చింది.
ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటించిన కాసేపటికే….యూరోపియన్ యూనియన్ అంతేస్థాయిలో రియాక్టైంది. అగ్రరాజ్యంపై 28 బిలియన్ డాలర్ల (26 బిలియన్ యూరోలు) సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఈ ట్యాక్స్ లు .. రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలపై పడేలా జాగ్రత్తలు తీసుకుటోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో వస్తుసేవలు ప్రియం కానున్నాయి. ఈయూ ప్రతీకార సుంకాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఈయూ మా దగ్గర వసూలు చేసినంతే తాము వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయని ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీనివల్ల అమెరికాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ట్రంప్ నిర్ణయాన్ని ఈయూ వెంటనే తిప్పికొట్టింది. అమెరికా (USA) 28 బిలియన్ డాలర్ల సుంకాలను విధించిందని, తాము అంతే స్థాయిలో దానిపై 28 బిలియన్ డాలర్ల సుంకాన్ని విధిస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ ప్రకటించారు. ఈ డ్యూటీలు.. ఉక్కు, అల్యూమినియంపైనే కాదని, దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా వర్తిస్తాయని, అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. తమ దేశ ఎగుమతులపై ట్రంప్ సుంకాలను విధించడం అన్యాయమని ఆస్ట్రేలియా(australia) ప్రధాని ఆంథోనీ ఆల్బర్ట్ స్పష్టంచేశారు. అయినా తాము వెంటనే ప్రతీకార సుంకాలపై స్పందించబోమన్నారు.






