భారత్-చైనా మధ్య నలిగిపోం.. తటస్థ విదేశాంగ విధానానికి జై కొట్టిన దిసనాయకే..
శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే… తమ విదేశాంగవిధానంపై పక్కా క్లారిటీ ఇచ్చారు. భౌగోళిక శక్తులైన చైనా, ఇండియా మధ్య తాము నలిగిపోవాలనుకోవడం లేదన్నారు. ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురవ్వాలని కోరుకోవడం లేదన్నారు.భారత్, చైనా దేశాలతో సంబంధాలను తాము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.తాము ఓ వర్గం పక్షం వహించమన్నారు. భౌగోళిక రాజకీయ యుద్ధంలో తాము ప్రస్తుతం పోటీదారులం కాదని.. భవిష్యత్తులో కాబోమన్నారు దిసనాయకే.భారత్, చైనాలు రెండూ తమకు విలువైన మిత్రదేశాలని..వాటితో తమ సర్కార్ హయాంలో బంధం మరింతబలోపేతం చేసుకుంటామన్నారు.
అదే సమయంలో యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతోనూ చక్కని సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నామన్నారు దిసనాయకే. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నవేళ.. తాము తటస్థ వైఖరి అవలంభించనున్నామన్నారు దిసనాయకే. ప్రపంచ శక్తుల ఆధిపత్యపోరుకు తాము దూరంగా ఉంటామన్నారు.ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక బంధాలను మరింతబలోపేతం చేసుకోవడంపై తాము దృష్టి పెడతామన్నారు. ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకే.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుందన్న అంశంపై జాతికి క్లారిటీ ఇచ్చారు.






