Donald Trump: స్టూడెంట్స్ కు మరో షాక్ ఇవ్వనున్న ట్రంప్..?

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి రోజురోజుకీ అమెరికాలో దిగజారుతోంది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలతో పాటుగా పలు విషయాల్లో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తమ దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాల విషయంలో కఠిన అడుగులు వేస్తోంది.
దీనితో పాటుగా భారత(India) విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు అనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. యూనివర్సిటీలు ఫీజులు కూడా పెంచే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఉంది. ప్రముఖ యూనివర్సిటీలో ఫీజుల పెంచాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. దానితోపాటుగా వీసా ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇక భారత్ తో పాటుగా కొన్ని దేశాల టూరిస్ట్ వీసాల విషయంలో కూడా ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.
అమెరికా ఎంబసీ సెంటర్లలో కూడా సిబ్బందిని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంటర్వ్యూల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థులు అమెరికా ఎక్కువ రావటమే కాకుండా అక్కడ స్థిరపడిపోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ట్రంప్ సర్కార్ సీరియస్ గా ఉంది. చాలామంది తల్లిదండ్రులను లేదంటే కుటుంబ సభ్యులను తీసుకొచ్చి అక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచనలో ఉన్నారు. దీనితో వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కసరత్తులు చేస్తుంది. ఇక అమెరికాలో వ్యాపారాలు చేసే హెచ్ వన్ బి ఉద్యోగుల విషయంలో కూడా కఠినంగానే వ్యవహరించనుంది.