డ్రాగన్ దూసుకెళ్తోంది గురూ..!
అగ్రరాజ్యంగా మారాలన్న పట్టుదలతో చైనా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. యుద్ధరంగంలో ఆధునిక రీతుల్ని మేళవిస్తూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ముఖ్యంగా యుద్ధక్షేత్రంలో రోబోలను మోహరించేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి గానూ ఆ టెక్నాలజీని పరిశీలిస్తోంది. ఇందుకు చైనా-కంబోడియా ” గోల్డెన్ డ్రాగన్ 2024 విన్యాసాల్ని వినియోగించుకుంది. అందులోని ఓ డాగ్ రోబో వీడియోను.. లేటెస్టుగా విడుదల చేసింది డ్రాగన్ కంట్రీ.. ఈ ప్రదర్శనలో రైఫిల్స్‌తో కూడిన రోబోట్ డాగ్‌లను ఆవిష్కరించింది.
ఈ ప్రదర్శన రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైనిక కార్యకలాపాలలో ఏకీకృతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని చైనా పరిశోధకులు చెబుతున్నారు. ఈ వీడియోల రోబో డాగ్స్ నడవడం, దూకడం,పడుకోవడం మరియు రైఫిళ్లను మోసుకెళ్లడం వంటివి కనిపిస్తాయి, వివిధ రకాలపోరాట దృశ్యాలలో వాటి సంభావ్య ప్రయోజనాన్ని ప్రదర్శిస్తాయి. “ఈ రోబోటిక్ యూనిట్లు మా కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు సంక్లిష్ట వాతావరణంలో వ్యూహాత్మక మద్దతును అందించడానికి రూపొందించబడ్డాయి” అని పేరు చెప్పని చైనా సైనిక అధికారి ఈ అభివృద్ధిపై వ్యాఖ్యానించారు.
దీనికి తోడు చైనా .. అత్యాధునిక డ్రోన్ల తయారీపైనా ఫోకస్ పెట్టింది. అతి తక్కువ ఖర్చుతో ప్రత్యర్థి ఆయుధ సంపత్తిని టార్గెట్ చేయడం… నేటి యుద్ధతంత్రం.. ఇదే పద్ధతిని ఉక్రెయిన్..రష్యా యుద్ధంలో అమలు చేస్తున్నాయి ఇరు దేశాలు.మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై ఇలాంటి వ్యూహాన్నే అవలంభిస్తోంది. మరోవైపు.. అగ్రరాజ్యం అమెరికా అయితే చాన్నాళ్ల క్రితమే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, ముందుకెళ్తోంది. ఈ తరుణంలో చైనా రక్షణ బడ్జెట్ పెంచుకోవడం, అత్యాధునిక యుద్ధరీతుల్ని అవలంభిస్తూ.. అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతోంది. మరోవైపు.. పొరుగున ఉన్న భారత్ కు సైతం పరోక్షంగా వార్నింగిచ్చినట్లేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.






