సాదాసీదాగా మధ్యంతర బడ్జెట్

వికసిత్ భారతే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్. ముఖ్యంగా పన్ను విధానంలో ఎలాంటి మార్పుచేయలేదు. గత ఏడాది పన్ను విదానమైన రూ.7 లక్షల వరకూ ఎలాంటి భారం లేకుండా రిబేటు కొనసాగించింది. ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి 6.2 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయరహదారులకు రూ.2.78లక్షల కోట్లు, రైల్వేకు 2.55 లక్షల కోట్లు కేటాయించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీకి రూ.2.13 లక్షల కోట్లు, హోంశాఖ 2.03 లక్షలకోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 1.77 లక్షల కోట్లు రసాయనాలు, ఎరువులు రూ.1.68లక్షలకోట్లు, కమ్యూనికేషన్లు రూ. 1.37 లక్షలకోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు.
మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. విమానయానరంగంలో 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. రైలు బోగీలన్నింటికీ వందే భారత్ ప్రమాణాలతో మార్చనున్నారు. ఫేస్ లెస్ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్‌ల చెల్లింపులు ఉండనున్నాయి. ఇక రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్నది లక్ష్యంగా ఉంది మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11లక్షల 11 వేల 111 కోట్ల కేటాయింపులు జరిపారు.సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు కేటాయించనున్నారు.
ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత, లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపుదిశగా చర్యలు చేపట్టనున్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు 20శాతం పెంచడం ద్వారా రూ 6.2 లక్షల కోట్ల కేటాయింపులు చేయనున్నారు..భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌నకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు, ఉడాన్ స్కీమ్ కింద 517 కొత్త రూట్‌లు ప్రారంభించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86 వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్: రూ.7,500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లుకేటాయింపులు జరిపారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు కేటాయించారు.
తెలంగాణలో వందశాతం విద్యుదీకరణ పూర్తయిందన్నారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో వందశాతం విద్యుదీకరణ పూర్తయిందన్నారు. విశాఖ రైల్వేజోన్‌కు ప్రభుత్వం భూమి అవ్వలేదన్నారు అశ్వినీ వైష్ణవ్. రైల్వేజోన్‌కు 53 ఎకరాల భూమి అడిగామని.. దీనికి సంబంధించిన డీపీఆర్ సైతం సిద్ధమైందన్నారువైష్ణవ్. ఏపీలో రైల్వేల అభివృద్ధికి 9,138కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇవాళ్టి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ కేవలం 57 నిముషాల్లోనే ముగించారు.ఆర్థికమంత్రిగా ఆమె ప్రసంగాల్లో ఇదే అత్యల్పం. అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు కూడా ఆమె పేరుపైనే ఉంది.ఇక వరుసగా 6 బడ్జెట్లు పెట్టి మొరార్జీదేశాయ్ రికార్డును నిర్మల సమం చేశారు.