Telugus in Americs : అమెరికాలో గలీజ్ పనులు చేస్తూ దొరికిపోతున్న తెలుగోళ్లు..!!
అమెరికా (America) ఓ కలల ప్రపంచం. ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని కొందరు కలలు కంటుంటారు. ఈ తరానికైతే అదొక స్వర్గధామం. అక్కడే చదువుకోవాలని.. అక్కడే ఉద్యోగాలు చేయాలని పరితపిస్తుంటారు. అదృష్టం కలిసొచ్చి కొంతమందికి మాత్రమే అలాంటి అవకాశం దొరుకుతుంది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ తెలుగుజాతి (Telugu Community) పరువునే బజారుకీడుస్తున్నారు కొంతమంది వెధవలు. ఇలాంటి వాళ్ల వల్ల తెలుగు కమ్యూనిటీకే కాదు.. మొత్తం ఇండియన్ కమ్యూనిటీ (Indian Community) కూడా మాటలు పడాల్సి వస్తోంది.
అమెరికాలో (USA) ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా కొంతమంది వ్యక్తులు డల్లాస్ (Dallas) లోని ఓ రెస్టారెంట్ (Restaurent) కి వెళ్లి ఫుడ్ తక్కువగా ఇస్తున్నారంటూ యజమానులను బెదిరించే ప్రయత్నం చేశారు. వాళ్లకు నిజంగా ఫుడ్ తక్కువ సప్లై చేసి ఉంటే వాళ్లు కంప్లెయింట్ చేసుకునే మార్గాలున్నాయి. కానీ వాళ్లు అలా చేయకుండా లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ (Black mail) చేయడం మొదలు పెట్టారు. దీన్ని రెస్టారెంట్ యజమానులు వీడియోలు తీసి బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది. డబ్బు డిమాండ్ చేసిన రోహిత్ (Rohit Vuppala) అనే వ్యక్తిపై హైదరాబాద్ (Hyderabad) లో ఇప్పటికే పలు కేసులు (Cheating cases) ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీల నాయకులతో రోహిత్ దిగిన ఫోటోలు కూడా బయటికొస్తున్నాయి.
ఆ మధ్య కొంతమంది అమ్మాయిలు అమెరికాలో దొంగతనం (theft) చేస్తూ దొరికిపోయారు. చదువుకోవడానికి వెళ్లిన వాళ్లు అక్కడ ఓ సూపర్ మార్కెట్ (super market) లో కొన్ని నిత్యావసర వస్తువులను దొంగలించారు. వాటికి బిల్లింగ్ చేయకుండా బయటకు తీసుకొచ్చేశారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించిన సిబ్బంది వాళ్లను తనిఖీ చేశారు. దీంతో వాళ్లిద్దరూ దొరికిపోయారు. సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి ఆ అమ్మాయిలకు బేడీలు వేసి మరీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అమెరికాలో కొంతమంది తెలుగు వాళ్లు వ్యభిచార గృహాలు (sex rocket) నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సందర్భాలున్నాయి. గతేడాది ఆగస్టులో డెంటన్ (Denton) లో ఓ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఐదుగురు తెలుగు వాళ్లున్నారు. వీళ్లంతా అక్కడికి చదువుకోవడానికి లేదంటే ఉద్యోగాలు చేయడానికి వెళ్లిన వాళ్లే. కానీ అక్కడ వీళ్లు చేస్తున్నది మాత్రం ఇలాంటి గలీజ్ పనులే. ఇక ఓ తెలుగు సంఘం పెద్దలు తమన వచ్చిన విరాళాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అమెరికాను కూడా మనోళ్లు అక్కడ ఇండియాలాగా మార్చేస్తున్నారు. ఓ వైపు మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఓ తెలుగు వ్యక్తి అధిపతిగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది తెలుగు వాళ్లు ఇలాంటి గలీజ్ పనులు చేస్తూ జాతి పరువును మంటగలుపుతున్నారు.







