Ambassador: నా పాత్ర మిత్రుడు 393 అంబాసిడర్తో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారు (Ambassador car)ను చూసి, దాంతో అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి (Chief Minister) గా ఉన్న సమయంలో 393 నవంబర్ ఉన్న అంబాసిడర్ వాహన శ్రేణిలో రాష్ట్రమంతా పర్యటించేవారు. భద్రతకారణాల రీత్యా ప్రస్తుతం ఆయన ఆధునిక వాహనాలు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న ఈ కారును ఇటీవల మంగళగిరి(Mangalagiri) లోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు ఈ కారును చూసి గత స్మృతులు నెమరువేసుకొన్నారు. నా పాత మిత్రుడు 393 అంబాసిడర్తో అంటూ ఎక్స్ వేదికగా ఆ ఫోటోలు పంచుకొన్నారు.







