రాహుల్ గాంధీ ఉగ్రవాదులతో భేటీ అయినా.. ఆశ్చర్యం లేదు

రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. బెంగళూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని తెలిపారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతుందని అన్నారు. భారత్ వ్యతిరేకి ఇల్హర్ ఒమర్‌తో రాహుల్ భేటీ అయ్యారని, ఖలిస్తాన్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడిరచారు. రాహుల్ గాంధీ ఓరోజు ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు.