Mohan Yadav : అలాంటి వారికి మరణశిక్ష ..మధ్యప్రదేశ్ సీఎం హెచ్చరిక

బలవంతపు మత మార్పిడి (Religious conversion )ని సహించబోమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులను అనుమతించబోమని స్పష్టం చేశారు. మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టం. అలాంటి వారిని జీవించడానికి అనుమతించకూడదు. బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష (Death penalty) విధించే నిబంధన మత స్వేచ్ఛ చట్టంలో చేర్చడానికి మేం కృషి చేస్తున్నాం అని అన్నారు.