వయనాడ్ విలయం.. కొండచరియల బీభత్సంలో

పశ్చిమ కనుమల నడుమ ఆహ్లాదంగా ఉండే కేరళలోని వయనాడ్ జిల్లా ఇప్పుడు ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం స్పష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద అసువులుబాశాయి. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘరో విపత్తులో ఇప్పటివరకు 93 మంది మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ కార్యాలయం వెల్లడించింది. మరో 116 మంది గాయపడినట్లు తెలిపింది. మరో 98 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.