Voter Card: కొత్త ఓటర్ కార్డులపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

దేశంలో ఓటర్ల సంఖ్య పెంచే దిశగా అడుగులు వేస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం (EC) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఎన్నికల కమిషన్.. బుధవారం నాడు ఓటర్ల జాబితా అప్డేట్ పై కీలక ప్రకటన చేసింది. అప్డేట్ లేదా అప్లై చేసుకున్న 15 రోజుల్లోపు ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు అందుతాయని ప్రకటించింది. వేగంగా డెలివరి చేయాలనే లక్ష్యంతో పాటుగా.. రియల్-టైమ్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలను మెరుగు పరచాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కార్డు అందించేందుకు నెల పైగా సమయం తీసుకుంటుంది.
రియల్-టైమ్ ట్రాకింగ్ ను కూడా ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా నిర్ణయం తీసుకుంది. అప్డేట్ చేసిన దగ్గరి నుంచి డెలివరి వరకు ఇది ట్రాకింగ్ చేస్తోంది. కార్డు స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక ప్రతీ స్టేజిలో ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా అందిస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డెలివరి చేయడానికి తమ వెబ్ సైట్ లో ఐటీ మాడ్యూల్ ను కూడా ప్రారంభించారు. పోస్ట్ ఆఫీస్(Post Office) వారితో కలిసి ఇక్కడ పని చేయనుంది. డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే.. వర్క్ ఫ్లో తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త కార్డుకు అప్లై చేసుకోవడానికి కూడా తలనొప్పి తగ్గించింది. ఓటరు ఐడీ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి NVSP పోర్టల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్, వన్ టైమ్ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత ‘ట్రాక్ అప్లికేషన్ స్టేటస్'(Track Application Status) విభాగానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డు అప్లై చేసిన అనంతరం ఇచ్చే మీ రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఫారమ్ 6 లేదా ఫారమ్ 6A సమర్పించిన తర్వాత వచ్చిన నెంబర్. మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.