వినోద్ కుమార్ చౌదరి అరుదైన ఘనత … సచిన్ తెందుల్కర్‌ను

కంప్యూటర్ శిక్షకుడు, జేఎన్‌యూ మాజీ ఉద్యోగి వినోద్ కుమార్ చౌదరి (43) అరుదైన ఘనతతో మాజీ క్రికెట్ సచిన్ తెందుల్కర్‌ను అధిగమించారు. ఢిల్లీకి చెందిన వినోద్ టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించాడు. తద్వారా 19 గిన్నిస్ రికార్డులను తన పేర లిఖించుకున్న సచిన్‌ను దాటేశాడు. కళ్లకు గంతలు కల్టుకుని అత్యంత వేగంగా టైటింగ్ చేయడం, నోటి పుల్ల ( మౌత్ స్టిక్)తో టైపింగ్, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్ చేయడం వంటి అరుదైన ఫీట్లు వినోద్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా కళ్లకు గంతలతో అంగ్ల అక్షరాలను రికార్డు సమయంలో జెడ్ నుంచి ఏ వరకూ ( వెనక్కు) టైపింగ్ చేసి రికార్డు సృష్టించాడు.