హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. దీనికి ముందు ఈ రెజ్లర్లు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనకు కలిశారు. మరోవైపు, పార్టీలో చేరడానికంటే ముందే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేశ్, పునియా రాజీనామా చేశారు.