తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కానుక : కిషన్ రెడ్డి

తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ -విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.