అమెరికా మహిళ కేసులో కొత్తమలుపు… తనను తానే

ఇటీవల మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ కనిపించిన అమెరికా మహిళ కేసులో ఊహించని విషయం వెలుగు చూసింది. తనను చెట్టుకు సంకెళ్లతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని ఆ మహిళ తాజాగా వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడించింది.