US Visa: అమెరికా వీసాకు.. సూపర్ సాటర్డే కార్యక్రమం!

అమెరికా విజిటర్ వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు మరోవిడత సూపర్ సాటర్ డే (Supar satar day) కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించనున్నట్లు అమెరికా(America) రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్‌లోని న్యూఢిల్లీ, ముంబయి కోల్‌కతా, హైదరాబాద్ కాన్సులేట్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ పూర్వ అమెరికా వీసాలున్నవారికి ఇంటర్వ్యూ మినహాయింంపుల కేసులను పరిష్కరించడంతో పాటు కాన్సులేట్ కార్యాలయాలకు కేటాయించిన శాశ్వత సిబ్బంది సంఖ్యను పెంచుతోంది. ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలను ప్రాపెస్ చేశాం. నాలుగో సూపర్ సాటర్ డే కోసం ఆత్రుతగా ఉన్నాం. అమెరికా, భారత్ ప్రజల సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసాల డిమాండ్‌ను అర్థం చేసుకుంటున్నాం. అందుకే నేడు అదనపు పనిగంటలు విధులు నిర్వహిస్తున్నాం అని న్యూఢిల్లీలోని అమెరికా కాన్సుల్ జనరల్ మార్క్‌మెక్ గోవర్న్ (Markmeck Govern) తెలిపారు.