Bangalore: త్వరలో బెంగళూరులో అమెరికా కాన్సులేట్

బెంగళూరులో ఏర్పాటు చేయనున్న అమెరికా కాన్సులేట్ (American Consulate) జనవరిలో అందబాటులోకి వచ్చే అవకాశముందని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) వెల్లడించారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో కాన్సులేట్ లేని పెద్ద దేశం అమెరికానే. దీనిపై స్పందించిన ఎరిక్.. త్వరలోనే ఈ విషయమైన శుభవార్త వింటారని పేర్కొన్నారు.