అదానీ ఖావ్డా ప్రాజెక్టును సందర్శించిన అమెరికా రాయబారి

గుజరాత్ (కచ్)లోని ఖావ్డా వద్ద అదానీ గ్రూపు అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెటీ సందర్శించారు. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల ఫలితంగా, అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు భారీగా క్షీణించి, మళ్లీ వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ సందర్శన అనంతరం భారత శూన్య ఉద్గారాల లక్ష్య సాధనను ముందుకు తీసుకెళ్లడంలో అదానీ గ్రీన్ వినూత్న ప్రాజెక్టులు ఏవిధంగా దోహదం చేస్తున్నాయో తెలుసుకున్నా. పర్యావరణ హితమైన పునురుత్పాదక విద్యుత్ కోసం ఇరు దేశాల భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని గార్సెటి తెలిపారు.
అమెరికా అధికారి నుంచి అదానీ గ్రూప్ ప్రశంసలు పొందడాన్ని సానుకూల సంకేతంగా చూడొచ్చు. ఖావ్డా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సందర్శించిన ఆమెరికా రాయబారికి ధన్యవాదాలు. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇంధన వినియోగంలో మార్పు, భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఆయన విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. పలు సందర్భాల్లో ఆయన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం చూసి ఆశ్చర్యపోయాను అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.