దేశంలోనే తొలిసారిగా… గురుగ్రామ్‌లో

జాతీయ విద్యా విధానంలో (ఎన్‌ఈపీ) భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాయల క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. గురుగ్రామ్‌లో బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ తన ఆఫ్‌లైన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఢిల్లీలో వర్సిటీ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందజేశారు. భారత్‌లోని క్యాంపస్ అందించే డిగ్రీలు బ్రిటన్ వర్సిటీ డిగ్రీలతో సమానంగా ఉంటాయని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. సౌతాంప్టన్ భారత్ క్యాంపస్‌లో జులై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి బిజినెస్, మేనేజ్‌మెంట్, కంప్యూటింగ్, లా, ఇంజినీరింగ్, ఆర్ట్, డిజైన్, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సులు అందుబాటులోకి వస్తాయి.