Uttarakhand : ఈరోజు ఉత్తరాఖండ్‌కే కాకుండా.. యావత్ దేశానికి : పుష్కర్‌సింగ్ ధామి

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. దానిలోని విధివిధానాలకు సంబంధించి పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఆవిష్కరించారు. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడిరచారు. ఈరోజు ఉత్తరాఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజుని, దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారిత కనిపిస్తుందని పేర్కొన్నారు. వారి హక్కులను కాలరాసే బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్(Triple Talaq), విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యూసీసీ (UCC) తోడ్పడుతుందని ధామి తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీవినుంచి దూరంగా ఉంచామని, తద్వారా ఆ తెగలు వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని అన్నారు.