అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో అసెంబ్లీలో బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. అపరాజిత విమెన్ అండ్ చెల్డ్ బిల్లు పేరిట దానిని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. చర్య అనంతరం దీనికి ఏగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ మాట్లాడారు. ఈ బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నాం. దోషులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నాం. ఈ రోజు మేం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది అని అన్నారు.