కేంద్ర ప్రభుత్వం వార్నింగ్.. వెనక్కి తగ్గిన ట్విటర్

కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి తాను సిద్ధమేనని, అయితే వాటి అములకు మరికొంత సమయం కావాలని ట్విటర్ యాజమాన్యం కోరినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం తుది వార్నింగ్ ఇచ్చిన తరువాత ట్విటర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. నూతన ఐటీ నిబంధనల అమలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‍కు రెండు రోజుల క్రితం తుది నోటీసులు ఇచ్చింది. వీటిని అమలు చేయకుంటే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులు కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించింది.