Suresh Gopi: అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు : సురేశ్ గోపి

ఇటీవల కేరళ (Kerala) లో జరిగిన ఓ ర్యాలీలో ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి (Suresh Gopi) ని సాయం కోరుతూ ఓ వృద్ధుడు అప్లికేషన్ ఇవ్వబోయాడు. కాగా తనకు ఇల్లు (House) కావాలంటూ అతడు ఇచ్చిన అప్లికేషన్ పత్రాన్ని మంత్రి తిరస్కరించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారింది. సురేశ్ గోపిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయంపై సురేశ్ గోపి మాట్లాడుతూ తాను నిలబెట్టుకోలేని అబద్ధపు హామీలు ప్రజలకు ఇవ్వలేనని అన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలు కాబట్టి , ఆ వృద్ధుడి నుంచి అప్లికేషన్ తీసుకోలేదని తెలిపారు. కొన్ని పార్టీలు ఈ వీడియోను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. అయితే ఆ వృద్ధుడి కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని మరో పార్టీ ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. దానివెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నా వారికి సొంత ఇల్లు ఇవ్వడం ముఖ్యమన్నారు.