Supreme Court:వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై .. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్ (సవరణ) చట్టం ( waqf amendment act)-2025 లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించే వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాం (Islam) ను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ప్ ( సవరణ)చట్టం 2025పై మొత్తం స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డు లో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer) గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.