Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా డీఎన్‌ఐ తులసీ గబ్బర్డ్ భేటీ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh)తో అమెరికా డీఎన్‌ఐ తులసీ గబ్బర్ (Tulsi Gabbar )తో భేటీ అయ్యారు. సౌత్‌బ్లాక్‌లో ఈ సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా వీరి చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందం (Defense agreement ) పైనా చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్‌లో రెండున్న రోజుల పర్యటనకు తులసీ గబ్బర్డ్ న్యూఢిల్లీ వచ్చారు. ట్రంప్ (Trump) రెండోవిడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.