Bill Gates : భారత యువతకు బిల్‌గేట్స్ కీలక సూచన.. ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్లండి

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్(Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) భారత యువతకు కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని, పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని కోరారు. అక్కడి వారు ఎంతో తెలివైనవారు. కానీ, వారికి అవకాశాలు తక్కువ. మంచి విద్య (Education) అందడం లేదు. వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని యువత గమనించాలి అని సూచించారు. ఓ పాడ్‌కాస్ట్ (Podcast) లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్ (Talent Hub ) గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్నపై బిల్‌గేట్స్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సులభంగా సమస్యలను పరిష్కరిస్తారు. వారి ఆవిష్కరణలను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. డిజిటల్ రంగం (Digital sector)లోనూ భారత్ దూసుకెళుతోంది. ఆధార్ లాంటి సంబంధింత కార్యక్రమాలు అందుకు అద్దం పడుతున్నాయి అంటూ ఆయన ప్రశంసించారు.