చైనా తరహా అభివృద్ధి.. భారత్కు మంచిది కాదు : రఘురామ్ రాజన్
సేవల రంగంపై అధికంగా దృష్టి పెట్టడమే భారత్కు మంచిదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అన్నారు. తయారీ రంగంపై ఎక్కువగా ఆధారపడిన చైనా తరహా అభివృద్ధి నమూనా భారత్కు ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఒక వేళ భారత్ ఈ విషయంలో చైనా నమూనాని అనుసరిస్తే భారత్ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని ప్రపంచం భరించలేదన్నారు. వాతావరణ మార్పులపై జరిగిన ఒక సదస్సులో రాజన్ ఈ విషయం స్పష్టం చేశారు. సేవల రంగం వాణిజ్యాన్ని ఒక సదస్సులో రాజన్ ఈ విషయం స్పష్టం చేశారు. సేవల రంగం వాణిజ్యాన్ని సరళీకృతం చేయడం అటు సంపన్న దేశాలతో పాటు వర్థమనా దేశాలకూ మంచిదని రాజన్ సూచించారు. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గి వాతావరణ కాలుష్యామూ తగ్గుతుందన్నారు. అదే పారిశ్రామిక రంగాన్ని మరింత సరళీకరిస్తే వచ్చే ఫలితాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయని హెచ్చరించారు.






