Mallikarjun Kharge : అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి .. బ్యాలెట్ వైపు : ఖర్గే

దేశంలో గుత్తాధిపత్యం కారణంగా సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. గుజరాత్ (Gujarat)లోని సర్దార్ వల్లభాయ్ పటేట్ నేషనల్ మెమోరియల్ (Sardar Vallabhbhai Patel National Memorial ) వద్ద నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంస్థలతో సహా అన్నింటిలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటోంది. అన్నిచోట్లా తన ఆధిపత్యాన్ని నెలకొల్పుతోంది. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (Electronic technology) కారణంగా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఈవీఎం (EVM)లు అందబాటులో లేవు. 140 కోట్ల మంది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు. త్వరలోనే ఈ దేశ యువత మేలుకొని బ్యాలెట్ (Ballet) లకు మద్దతుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తారు అని ఖర్గే పేర్కొన్నారు.