ఫెమినా మిస్ ఇండియా పోటీలకు.. ప్రకృతి, భవ్యారెడ్డి ఎంపిక

ఫెమినా మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం, మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యా రెడ్డి (21) ఎంపికయ్యారు. త్వరలో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ నెల 13న ముంబయిలో జరిగిన అర్హత పోటీల్లో వారి సొంత రాష్ట్రాల తరపున పోటీపడి గెలుపొందారు. హైదరాబాద్‌లోని లోతుకుంటలో నివాసముంటున్న భవ్యారెడ్డి బీటెక్ పూర్తి చేసి మోడలింగ్‌పై దృష్టి కేంద్రీకరించారు. బెంగళూరులో ఉంటున్న ప్రకృతి క్రీడా, మోడలింగ్ రంగాల్లో రాణిస్తున్నారు.