Tamil Nadu : తమిళనాడు బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ మాయం

జాతీయ విద్యావిధానంపై తమిళనాడు (Tamil Nadu) , కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget )లో రూపాయి సింబల్ (Rupee Symbol ) ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు (Tamil communities) ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాష(Hindi language ) ను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే(DMK) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.