తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పరీక్షను రద్దు చేయాలి

దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌యూజీ-2024 పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పరీక్షకు ముందే పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్య సీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతో పాటు విపక్ష నేతలు ఆమోదం తెలిపారు.