తాప్సీ భర్త మథథియాస్ కీలక నిర్ణయం..

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత్‌కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ నిరాశపర్చిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఈ జంట అనూహ్య రీతిలో ఓటమిపాలై విశ్వ క్రీడల నుంచి నిష్త్రమించింది. ఈ నేపథ్యంలో వీరికి కోచింగ్ ఇచ్చిన ప్రముఖ కోచ్, నటి తాస్పీ భర్త మథియాస్ బో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలికాడు. నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇక భారత్‌లోనే గాక ప్రపంచంలో ఎక్కడా ఈ బాధ్యతలను కొనసాగించబోను. నా జీవితంలో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లో వెచ్చించాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో కూడుకున్నదే. ఇక అలసిపోయా. ఈ అవవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అని మాథియాస్ బో తెలిపారు.