Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు టాస్క్‌ఫోర్స్: సుప్రీంకోర్టు ఆదేశాలు

విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఐఐటీ-ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, ఆత్మహత్యలను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు (Supreme Court) పేర్కొంది.
‘‘ప్రతి విద్యాసంస్థ తమ క్యాంపస్‌లో విద్యార్థులను కాపాడే బాధ్యత కలిగి ఉంటుంది. ఏదైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే, యాజమాన్యం తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి’’ అని ధర్మాసనం (Supreme Court) పేర్కొంది. పోలీసులు కూడా ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా కోర్టు తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల సమయంలో అండగా ఉండే వ్యవస్థలు లేకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. దీనిని నివారించేందుకు, అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు (Supreme Court) అభిప్రాయపడింది.
విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు (Supreme Court).. దీనికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వామ్యం చేయాలని సూచించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ కీలకంగా పని చేస్తుందని కోర్టు (Supreme Court) పేర్కొంది.