సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం

సుప్రీంకోర్టు కు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడిరచారు. వీరిద్దరి నియామకానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా వెలువరించిన ఉత్తర్వులతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34కు పెరిగింది.
జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్ మణిపూర్ నుంచి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అయన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు తాత్కాలిక హైకోర్టు చీప్ జస్టిస్‌గా కొనసాగుతున్న జస్టిస్ మహదేవన్ చెన్నైకి చెందినవారు. మద్రాస్ లా కాలేజీ పూర్వ విద్యార్ధి. న్యాయవాదిగా ఆయన 9 వేలకు పైగా కేసులకు హాజరయ్యారు. తమిళనాడు ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున మద్రాస్ హైకోర్టులో పలు కేసులు వాదించిన ఆయన, 2013లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌గా పదోన్నతి పొందారు.