Sunita Williams : త్వరలోనే భారత్‌కు సునీత!

అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిమీదకి తిరిగి వచ్చిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) త్వరలో భారత్ (India)కు రానున్నారని ఆమె బంధువొకరు మీడియాకు తెలిపారు. సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం. సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఆమెతో మాట్లాడుతన్నాం. ఇటీవల నేను మహా కుంభమేళా (Maha Kumbh Mela ) క వెళ్లగా అక్కడి విశేషాలను అంతరిక్షం నుంచే అడిగి తెలుసుకున్నారు అని ఆమె బంధువు ఫాల్గుణి (Falguni )తెలిపారు.