రాజీవ్ అరుదైన ఘనత.. భారత నౌకదళంలో మొదటి మహిళాగా

సబ్ లెఫ్టినెంట్ అనామిక బీ రాజీవ్ అరుదైన ఘనతను సాధించారు. ఆమె ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వింగ్స్ ను అందుకున్న అనంతరం భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు. తమిళనాడు అరక్కోణంలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. అలాగే లఢక్‌కు చెందిన మొదటి కమిషన్డ్ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ జమ్యాంగ్ త్సెవాంగ్ సైతం క్యాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్‌గా పట్టభద్రురాలయ్యారు. మొత్తం 21 మందికి ఈస్ట్రన్ నావల్ కమాండిరగ్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ గోల్డెన్ వింగ్స్‌ను అందజేశారు. కాగా, ఈ శిక్షణ తర్వాత అనామిక రాజీవ్ సీ కింగ్స్, ఏఎల్‌హెచ్ ధ్రువ్స్, చేతక్స్, ఎంహెచ్`60 ఆర్ వంటి హెలికాప్టర్‌లు నడపడానికి అర్హత సాధించిన తొలి మహిళా ఫైలట్‌గా నిలిచారు. కాగా, నేవీ ఇప్పటికే సముద్ర నిఘాకు డోర్నియర్`228 వంటి హెలికాప్టర్లను మహిళా పైలట్‌లను వివినియోగిస్తున్నది.