Capability Center: హైదరాబాద్‌లో ట్రూయిస్ట్ జీసీసీ సెంటర్

అమెరికా దిగ్గజ కంపెనీ హైదరాబాద్‌లో తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. నార్త్ కరోలినా (North Carolina) కేంద్రంగా పనిచేసే ట్రూయిస్ట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ టెక్ సెంటర్ పేరుతో ఈ జీసీసీని ఏర్పాటు చేయనుంది. దాదాపు 25 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,200 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు కోసం భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) పోటీపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ ప్రస్తుతం ట్రూయిస్ట్ ఫైనాన్షియల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్ (Software) సేవలు అందిస్తోంది. ముందు దేశంలో ఎక్కడో ఒక చోట తాత్కాలికంగా ఈ జీసీసీని ఏర్పాటు చేసి రెండు లేదా మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది అమెరికా బ్యాంక్ లక్ష్యంగా తెలుస్తోంది. తొలి ఏడాది 1,000 మందితో ప్రారంభమయ్యే ఈ జీసీసీలో ఐదేళ్లు తిరిగే సరికి 3,000 వరకు ఉద్యోగాలు ఏర్పడతాయని సమాచారం.