Ashwini Vaishnav: గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు : కేంద్రం

గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని కేంద్రం వెల్లడించింది. అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) లోక్‌సభలో వెల్లడిరచారు. వీటికట్టడి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming ) ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా? అని మారన్ ఘాటుగా ప్రశ్నించారు. నిషేధం విధించడానికి ప్రభుత్వానికి ఎంత సమయం కావాలని అడిగారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోండి అని సూచనలు చేశారు. రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడిరచారు.