MK Stalin : కేంద్రంపై స్టాలిన్ డీలిమిటేషన్ వార్.. ఏడు రాష్ట్రాలకు సీఎంలకు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin)కేంద్రంపై పోరాడుతున్నారు. ఈ విషయంపై తాజాగా ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (Delimitation) కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జరిగిన తీర్మానం ఆధారంగా ఈ లేఖలు (Letters ) రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాకు వీటిని పంపారు. సమిష్టి కార్యాచరణ కోసం మార్చి 22న చెన్నై (Chennai)లో సమావేశానికి హాజరుకావాలని కోరారు. అలాగేఈ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిక్ష నాయకులను ఆయన ఆహ్వానించారు.