ముగిసిన అంతిమయాత్ర… ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగింత

ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివదేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించారు. సీతారామ్ ఏచూరి కోరిక మేరకు ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి దానం చేసిన విషయం తెలిసిందే. సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనారథం ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల వరకూ అక్కడే ఉంచారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి కమ్యూనిస్టు శ్రేణులు ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని అంతియ యాత్రగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈసందర్భంగా లాల్‌సలామ్ కామ్రేడ్ నినాదాలు హోరెత్తాయి. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సీతారాం ఏచూరి చికిత్స పొందుతూ ఈ నెల 12న తుదిశ్వాస విడిచినవిషయం తెలిసిందే.