Brendan Lynch : భారత్‌కు అమెరికా వాణిజ్య ప్రతినిధి

అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ (Brendan Lynch) మార్చి 25 నుంచి 29వ తేదీ వరకు భారత్‌తో పర్యటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్ అధిక సుంకాలు విధిస్తోందని, ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో ట్రంప్ వాణిజ్య యుద్ధాలను కొనసాగిస్తున్న వేళ ఆ దేశానికి చెందిన వాణిజ్య ప్రతినిధి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ, మధ్య ఆసియా (Central Asia ) కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా ఉన్న బెండన్ లించ్ , యూఎస్ అధికారుల బృందంతో కలిసి వచ్చే నెలలో భారత్ రానున్నారని, ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సుంకాల అమలు మొదలైన విషయాల గురించి వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ (Piyush Goyal ) సహా ఇతర భారత అధికారులతో చర్చలు జరపున్నారని అధికారక వర్గాలు పేర్కొంటున్నాయి.