Yashwant Verma: జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Verma) అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడిన వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ (Allahabad) హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక తుది ప్రకటన వెలువడనుంది. న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసర విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఇదివరే పేర్కొంది. అయితే ఆ నిర్ణయంపై కొలిజియం (Coliseum) లోని కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఢల్లీి హైకోర్టు రిజిస్ట్రీ కీలక ప్రకటన చేసింది. ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అది అమల్లో ఉంటుందని తెలిపింది. కానీ ఇంతలోనే కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.