Miss Grand: మిస్ గ్రాండ్ ఇండియా పోటీలకు చంద్రగిరి యువతి

ఢిల్లీ లో జులై 3 నుంచి 13 వరకు జరిగే మిస్ గ్రాండ్(Miss Grand) ఇండియా-2025 పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున తిరుపతి జిల్లా చంద్రగిరి చెందిన సంజన (Sanjana) వరద ఫైనలిస్టుగా ఎంపికయ్యారు. ఇందులో విజేతగా నిలిస్తే థాయిలాండ్ (Thailand) లో జరిగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ (India)కు ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలోనూ పలు అందాల పోటీల్లో రాణించారు. 2023లో మిస్ టీన్ గ్లోబల్ ఇండియా జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి, 2024లో మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ టైటిల్ (Title) గెలుచుకున్నారు.