Indonesia : గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు!

గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేసియా(Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరయ్యే అవకాశం ఉంది. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంతో (Prabowo Subianto) 2024 అక్టోబరులో ఇండోనేసియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పర్యటనలో ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీ (Prime Minister Modi )తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ (Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.