ఈ విషయంలో గీత దాటితే కఠిన చర్యలు : ఆర్బీఐ
డెబిట్, క్రెడిట్ కార్డుల జారీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరింత కట్టుదిట్టం చేసింది. అడగకుండా ఎవరికీ ఎటువంటి కార్డులు జారీ చేయవద్దని బ్యాంకులు, కార్డుల కంపెనీలకు ఆదేశించింది. ఉన్న కార్డులను అప్ గ్రేడ్ చేసేందుకూ ఖాతాదారుల అనుమతి తప్పని సరని స్పష్టం చేసింది. ఈ విషయంలో గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ కార్డుల జారీ లేదా అప్‌గ్రెడేషన్‌కు ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు అందుకు రెట్టింపు మొత్తం జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది.






