రాష్ట్రపతి భవన్‌లో రెండు హాళ్లకు కొత్త పేర్లు

రాష్ట్రపతి భవన్‌లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్‌ను గత ఏడాది అమృత ఉద్యాన్‌గా మార్చిన విషయం తెలిసిందే.